అసలు విషయానికి వచ్చేసరికి తోక ముడుస్తాడు – విజయసాయి రెడ్డి

Monday, December 28th, 2020, 12:07:26 PM IST

విశాఖ పట్టణం లో జరుగుతున్న రాజకీయ పరిణామాల పై పలువురు నేతలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి కి వెలగపూడి వరుస సవాళ్ళను విసురుతూ, ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే వ్యవహారం పై మరొకసారి ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అను కుల మీడియా ముందుకు వచ్చి ప్రమాణాలు అంటూ పులి వేషాలు వేస్తాడు, అసలు విషయానికి వచ్చేసరికి తోక ముడుస్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక్క గజం ఆక్రమించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ కోతలు కోశాడు అంటూ విమర్శించారు. అయితే మరి మొన్న అధికారులు రుషికొండ లో స్వాధీనం చేసుకున్న 225 కబ్జాల భూమి ఎవరిది అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. పేద ప్రజలకు ఉచిత ఇళ్ళ స్థలాలు పంపిణీ విషయం లో వైసీపీ కోసం పని చేస్తున్న పేదలకు కూడా అన్యాయం జరిగింది అని తెలుపుతున్నారు. అయితే పేద ప్రజలకు ఇళ్ళ స్థలాల పంపిణీ విషయం లో కూడా విజయసాయి రెడ్డి స్పందించాలి అంటూ కోరుతున్నారు.