ఇలాంటి ఛండాలపు రాజకీయాలతో సాధించేదేమి ఉండదు – ఎంపీ విజయసాయి రెడ్డి

Wednesday, April 21st, 2021, 06:02:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రధాన ప్రతి పక్ష పార్టీ అయిన తెలుగు దేశం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్లోజ్ అయ్యే ముందు పచ్చ పార్టీ నేతలు దింపుడు కళ్ళం ఆశతో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు. అనంత జిల్లాలో ఆశా వర్కర్ తో లైంగిక దాడి కేసు పెట్టించి ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎక్స్ పైరి డేట్ దాటిన చీప్ ట్రిక్కులివి అంటూ సెటైర్స్ వేశారు. అయితే ఇలాంటి ఛండాలపు రాజకీయాలతో సాధించేదేమి ఉండదు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఘాటు విమర్శలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ పై సోషల్ మీడియా వేదిక గా విమర్శలు చేయడం తప్ప, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఎలాంటి చర్యలు తీసుకోరు అంటూ కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.