టీడీపీ దాడులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తాం – విజయసాయి రెడ్డి

Monday, January 25th, 2021, 03:41:33 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఆలయాల్లోని విగ్రహాల పై దాడులు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల సంతబొమ్మాళి నంది విగ్రహం ను టీడీపీ నేతలు తీసుకెళ్తున్నారు అంటూ వైసీపీ నేతలు వరుస విమర్శలు చేశారు. అయితే ఈ మేరకు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తెలుగు దేశం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై తెలుగు దేశం పార్టీ దాడులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

అయితే తాడేపల్లి లోని సీఎం కార్యాలయం లో ఎంపీ లతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరగాల్సిన చర్చల పై ఎంపీ లకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. అయితే సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పై ఆరోపణలు చేశారు. దేవుడి విగ్రహాల ధ్వంసం లో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని, ఆలయాల పై టీడీపీ దాడుల ఘటన పై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ తో జరిగిన సమావేశం లో రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం నిధుల గురించి చర్చించిన విషయాన్ని వెల్లడించారు. రెవెన్యూ లోటు విషయాన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి అన్నారు.