సోము వీర్రాజు కు ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్…జనం మాత్రం మళ్ళీ వైసీపీనే దీవిస్తారు!

Monday, March 29th, 2021, 11:30:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చంశనీయం గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను పువ్వు లా జాగ్రత్త గా చూసుకోవాలి అని, రాష్ట్రానికి కాబోయే అధిపతి పవన్ కళ్యాణ్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు సోము వీర్రాజు. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో సోము వీర్రాజు మీడియా సమావేశం లో చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

తిరుపతి ఉపఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామా లకు జనం నవ్వుకుంటున్నారు అంటూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడు అన్నట్లు నటిస్తున్నారు అంటూ సెటైర్స్ వేశారు. ఎవరిపాత్రల్లో వారు జీవించండి, చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి అంటూ విమర్శించారు. అయితే జనం మాత్రం మళ్ళీ వైసీపీ నే దీవిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.