ఎమ్మెల్యే కూడా కానీ వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట – ఎంపీ విజయసాయి రెడ్డి

Wednesday, March 31st, 2021, 01:15:57 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో భాగం గా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అధిపతి అవతాడు అని మోడీ చెప్పిన మాటలను సోము వీర్రాజు మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఇందుకు వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే ఇదే విషయం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు. అయితే కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్ వేయడం కాక మరేమిటి అంటూ విమర్శలు గుప్పించారు. ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు అని, దానిని తీసుకొనే పార్టీకి ఉనికి లేదు అని సెటైర్స్ వేశారు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాక గతంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు.