వారికి ఆ ఛాన్స్ లేకుండా చేశారు సీఎం జగన్ – విజయసాయి రెడ్డి

Sunday, November 15th, 2020, 05:34:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పై ఎప్పుడు మాట్లాడే వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ప్రతి పక్ష నేతలను టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఇసుక గురించి అవాకులు చెవాకులు పేలే బాబులకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఎవరెవరు ఇసుకను ఉచితంగా తీసుకెళ్ళవచ్చో ప్రభుత్వం ప్రకటించింది అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిన్నర క్రితం దాకా ఇసుక మాఫియా రాజ్యమేలిన రీచ లలో ఇప్పుడు యంత్రాల శబ్దం తప్ప ఇసుక దొంగల నీడలు కూడా కనిపించడం లేదు అని తెలిపారు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ పాలనా విధానంపై వరుస విమర్శలు చేస్తున్నారు. అప్పటి పాలనలో కంటే ఇసుక పద్దతి ను మూడు సార్లు మార్చడం పట్ల వరుస ప్రశ్నలు సండిస్తున్నారు. మరికొందరు మాత్రం గత టీడీపీ పాలన విధానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్షలు చేస్తున్నారు.