గుళ్ళు, విగ్రహాల ధ్వంసానికి తెగబడుతోంది ప్రతి పక్షం – విజయసాయి రెడ్డి

Tuesday, January 5th, 2021, 01:40:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రామతీర్థం లోని రాముని విగ్రహ ధ్వంసం ఘటన సర్వత్రా చర్చాంశానీయం గా మారింది. ఇప్పటికే అధికార పార్టీ ఇందుకు తగు విధంగా పలు చర్యలు తీసుకుంది. అయితే నేడు జన సేన మరియు బీజేపీ నేతలు ఈ ఘటన విషయం పై ధర్మ యాత్ర కూడా చేస్తూ నిరసన తెలిపేందుకు సిద్దం అవ్వగా, పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతి పక్ష పార్టీ నేతలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ పథకాల్లో ఏవైనా లోపాలు దొర్లితే ఎత్తి చూపాల్సిన ప్రతి పక్షం, అటువంటివి ఏవీ కనిపించక పోవడం తో గుళ్ళు, విగ్రహాల ద్వంసానికి తెగబడుతోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.కొట్లాటలు పెట్టడం మాని, మంచి పనులకు సూచనలు ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తప్పకుండా స్వీకరిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. కుట్రలకు పాల్పడితేతప్పించుకోలేరు అని, చట్టం వదిలిపెట్టదు అంటూ విజయసాయి రెడ్డి హెచ్చరించారు.