ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావే!

Monday, January 11th, 2021, 07:34:03 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు గతం లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్నికలకి సంబంధించి ప్రకటన రావడం పట్ల వైసీపీ నేతల నుండి ఉద్యోగ సంఘాలు కూడా ఈ నిర్ణయం ను వ్యతిరేకిస్తున్నాయి. అయితే దీని పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సి ఎస్ వద్దన్నా, ఉద్యోగ సంఘాలు నో అన్నా, కరోనా వాక్సిన్ కి ప్రభుత్వం సిద్దం అయినా, ఎవరి ప్రయోజనాల కోసం ఈ పంచాయతీ నిమ్మగడ్డ అంటూ విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం తో సంప్రదింపులు జరపమని సుప్రీం కోర్టు చెబితే నువ్వు చేసే నిర్వాకం ఇదా అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావే అంటూ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి పై నెటిజన్లు వరుస విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ విషయం లో వైసీపీ తీరు పట్ల ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.