నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బెదిరే వారు లేరు

Tuesday, February 2nd, 2021, 04:23:06 PM IST

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిక ప్రసంగాలు తప్ప అసలు పని చేయడు అని, పచ్చ నేతలను మించి మాట్లాడుతున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బెదిరే వారు లేరు అంటూ చెప్పుకొచ్చారు. సజావుగా ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు ఆన్లైన్ అంటూ పుల్లలు పెడుతున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పచ్చ నేత రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నాడు నిమ్మగడ్డ అంటూ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నిమ్మగడ్డ మీ కేసులలో సాక్ష్యం చెబితే ఇక జీవితాంతం చిప్పకూడే అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మీరు చేసిన అవినీతి కి నిమ్మగడ్డ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ పలువురు అంటున్నారు. కొందరు మాత్రం నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలను సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.