లోకేశం…మీ లిటిగేషన్ రాజకీయాలు ఎవరికి తెలీవు?

Thursday, August 27th, 2020, 11:47:42 PM IST

Ycp-mp-Vijayasai-reddy
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి పై తాజాగా తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి వరుస ప్రశ్నలు వేస్తూ నారా లోకేష్ తాజాగా పలు వ్యాఖ్యలు చేయడం పట్ల వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. అయితే విజయ సాయి రెడ్డి నారా లోకేష్, చంద్రబాబు తీరు ల పై పలు వ్యాఖ్యలు చేశారు.

లోకేశం, మీ లిటిగేషన్ రాజకీయాలు ఎవరికి తెలీవు అని సెటైర్ వేశారు. కానీ మీ శాడిజం పరాకాష్ట కి చేరింది అని అన్నారు. చివరికి పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ ను కూడా అడ్డుకుంటున్నారు ఎందుకు అని నిలదీశారు. అమరావతి అవినీతి పుట్ట కులిపోతుందనా అని విమర్శించారు. ఏదేమైనా పేదల ఇళ్ళ స్థలాలను అడ్డుకున్న ప్రతి పక్షంగా మీరు చరిత్రలో నిలిచి పోతారు జూమ్ బాబులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.