కేఏ పాల్ కన్నా పెద్ద నాయకునివా లోకేషం? – విజయసాయి రెడ్డి

Thursday, May 6th, 2021, 03:13:50 PM IST


తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మరొకసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రపంచం లో ఎక్కడ ఏం జరిగినా అది తన వల్లే అంటాడు చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కలాం ను రాష్ట్రపతి గా, వాజ్ పాయ్ ను ప్రధాని గా చేసింది తానే అంటాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ జబ్బు పప్పు రత్నానికి అంటింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ పరీక్షల వాయిదా తనవల్లే అంటూ డప్పు కొడుతున్నాడు అంటూ విమర్శించారు. అయితే కే ఏ పాల్ కన్నా పెద్ద నాయకుడివా లోకేశం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే మరొక ట్వీట్ లో ధూళిపాళ్ల తీరును ఎండగడుతూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధూళిపాళ్ల కు 1400 కోట్ల రూపాయల సంగం డెయిరీ ఆస్తులను అప్పగించి వాటాలు పంచుకున్న చంద్రబాబు, ఆయన బందిపోట్ల ముఠా అమూల్ గురించి అవాకులు, చెవాకులు పేలుతున్నారు అంటూ విమర్శించారు. అమూల్ హెరిటేజ్ లా రైతుల రక్తం పీల్చే ప్రైవేట్ సంస్థ కాదు, అని, లక్షల మంది రైతులు యజమానులు గా ఉన్న సహకార సొసైటీ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు మాత్రం టీడీపీ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.