తండ్రిలానే మాలోకం మతి చెడిపోయింది – విజయసాయి రెడ్డి

Sunday, October 11th, 2020, 10:53:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరుకుంటున్న సమయం లో ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం అంటూ తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. అయితే వారి మృతి కి కారణం వైసీపీ నేతల అవమానాలు అంటూ సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు గానూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. నారా లోకేష్ తీరును ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు.

బాబు నుండి అవినీతి, అసమర్థత, అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు ఇప్పుడు బాబు నే మించి పోయాడు అని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. వయో భారంతో సంభవించే సహజ మరణంను కూడా తన రియల్ ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్ట్ లో వేసే దుష్ప్రచారానికి దిగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రిలానే మాలొకం మతి చెడిపోయింది అంటూ నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు. ఇంకెంత కాలం ఔట్ డేటెడ్ బుర్ర వాడుతావ్ మాలోకమ్ అంటూ విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు. ఎప్పుడు టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోమారు హాట్ టాపిక్ గా మారాయి. వీటి పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.