బాబు, లోకేష్ ల పై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Friday, May 14th, 2021, 06:06:15 PM IST


తెలుగు దేశం పార్టీ నేతలు అధికార పార్టీ వైసీపీ పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. పాలన విధానం లో పట్ల ,వాక్సిన్ విషయం మరియు కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో పూర్తి గా విఫలం అయ్యారు అంటూ టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ఘటు వ్యాఖ్యలు చేశారు.

పప్పు అలియాస్ చిట్టి నాయుడు, తుప్పు అలియాస్ పెద్ద నాయుడు ఎన్ని సార్లు అడిగినా చెప్పడం లేదు అంటూ విమర్శించారు. ఇంతకీ మీరు వాక్సిన్ వేయించుకున్నారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయినా కరోనా కి మనిషి రూపం అయిన మీకు వాక్సిన్ అవసరం ఏముంటుంది అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు మాత్రం టీడీపీ తీరు పట్ల విమర్శలు చేశారు.