చంద్రబాబు, యనమల పై ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Wednesday, March 17th, 2021, 02:45:22 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేకవన్నే పులి, ఈ గుంటనక్క అని ఎన్టీఆర్ పేర్కొన్న చంద్రబాబు నాయుడ్ని, వెన్నుపోటు కి స్పీకర్ గా ఉపయోగపడిన యనమల ను మానవ హక్కుల సమావేశానికి రమ్మంటే వారు ఎందుకు వస్తారు చెప్పండి అని వ్యాఖ్యానించారు. తమను మానవులు గా గుర్తించడం వారిద్దరికీ ఏనాడూ ఇష్టం ఉండదు అని ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

ప్రతి పక్ష పార్టీ లో ఉండగా వివేకానంద రెడ్డి హత్య విషయం లో చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేసిన వ్యాఖ్యలని పోస్ట్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఆ కేసు విషయాన్ని తేల్చండి అంటూ చెప్పుకొచ్చారు. మరి కొందరు మాత్రం తెలుగు దేశం పార్టీ ఉండగా, ముఖ్యమంత్రి గా ఎన్టీఆర్ కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు మరియు యనమల రామకృష్ణుడు ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ చంద్రబాబు, యనమల పై విమర్శలు చేస్తున్నారు.