టీడీపీ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది – విజయసాయి రెడ్డి

Wednesday, February 10th, 2021, 07:30:08 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ తో పాటుగా ఫలితాలు కూడా వెలువడాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతి పక్ష పార్టీ నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్, నిమ్మగడ్డ ఓవర్ యాక్షన్ బెడిసి కొట్టింది అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికీ జనం చుక్కలు చూపించారు అని వ్యాఖ్యానించారు. అయితే 95 శాతం పైగా పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్ధుల గెలుపే ఇందుకు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అంటూ సెటైర్స్ వేశారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ కి మద్దతు ఇస్తూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. విజయసాయి రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన వైఖరి ను తప్పు పడుతున్నారు. అంతేకాక రాజ్యసభ లో వెంకయ్య నాయుడు పై వ్యాఖ్యలు చేసి, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వంటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం టీడీపీ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ కి దీటుగా సమాధానం ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.