వింతల్లోకెల్ల వింత ఇది – ఎంపీ విజయసాయి రెడ్డి

Thursday, November 12th, 2020, 07:27:56 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక ఉపఎన్నిక సంచలనం సృష్టించింది. అధికార పార్టీ తెరాస ను ఓడించి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడం పట్ల పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జరిగింది తెలంగాణ లో అయినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కూడా ఈ ఉప ఎన్నిక గెలుపు చర్చంశనీయం అయింది. అయితే తెలంగాణ లో ఏపీ కి చెందిన పార్టీలు టీడీపీ మరియు వైసీపీ ల హవా చాలా వరకు తగ్గింది అని చెప్పాలి, పార్టీ కి చెందిన కీలక నేతలు సైతం ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. అయితే ఈ దుబ్బాక లో పోటీ చేసేందుకు అభ్యర్దులు కూడా లేరు అంటూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ పై సెటైర్స్ వేశారు.

తండ్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాలోకం ప్రధాన కార్యదర్శి అంటూ ఎద్దేవా చేశారు.దుబ్బాక ఉపఎన్నిక లో పోటీ చేయడానికి అభ్యర్ధి దొరకలేదు అని, అక్కడ బీజేపీ గెలిస్తే సొంత పార్టీ విజయం సాధించినట్లు మురిసిపోతున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇంకొకరి గెలుపును కూడా ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. వింతల్లోకెల్ల వింత ఇది అంటూ సెటైర్స్ వేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. టీడీపీ తో పాటుగా వైసీపీ కూడా మూట ముల్లుసద్దుకొని వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.