చంద్రబాబు, లోకేష్ ల పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Saturday, January 2nd, 2021, 03:00:09 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఓటు కి నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంకా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇందులో టీడీపీ అగ్ర నేతల హస్తం ఉందని పలు వార్తలు వస్తుండగా, వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓటుకు నోటు సూత్రదారి పాత్రధారులు పెదబాబు, చినబాబు అని తేలిపోయింది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నేరం చేయడమే కాదు, కవర్ అప్ చేసేందుకు ప్రయత్నించారు అని ఈ డీ కి మత్తయ్య ఇచ్చిన స్టేట్మెంట్ లో ఋజువు అయింది అని అన్నారు. వేరే రాష్ట్రాల్లో ఎన్నికలను మేనేజ్ చేసేందుకు ఆంధ్రను కొల్లగొట్టారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఇంకెంతమంది ను మేనేజ్ చేస్తావ్ బ్రిఫ్డ్ బాబు అంటూ విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఉండగా, మరి కొందరు మాత్రం జగన్ పై, విజయసాయి రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.