లీడర్ కు, చీటర్ కు తేడా ఇదే – విజయసాయి రెడ్డి

Thursday, November 5th, 2020, 12:48:01 PM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానాలను వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసిస్తున్నారు. సీఎం జగన్ పాలన తీరును కొనియాడుతూ, గత ప్రభుత్వం పాలన పై, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే మరోమారు చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కోల్ బ్లాకుల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ఖనిజాబివృద్ది సంస్థ జార్కండ్ లోని బ్రహ్మ దిహ గనులను గెలుచుకుంది అని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వ సంస్థల బొగ్గును కాదు అని, తన బినామీల తో బొగ్గును ఇంపోర్ట్ చేయించి కమీషన్ల కోసం ఎక్కువ ధరకు కొన్నాడు అని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.లీడర్ కు చీటర్ కు ఉన్న తేడా ఇదే అంటూ విజయసాయి రెడ్డి తెలిపారు.