గొప్పలు చెప్పుకుంటూ రిటైర్మెంట్ రోజుల్ని వెళ్లదీస్తున్నాడు

Monday, November 2nd, 2020, 12:33:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వరుస విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అన్ని కార్యక్రమాల పై, పనుల పై, ప్రాజెక్ట్ లపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని విషయం, పోలవరం నిర్మాణం, ఇంకా పలు అంశాల పై టీడీపీ వైసీపీ కి టార్గెట్ అయింది. అయితే మరొకసారి వైసీపీ కీలక నేత అయిన ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాబు చెప్పినట్టు తన చిట్ట చివరి అయిదేళ్ల పాలనలో 15 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఉంటే, రాష్ట్రంలోని యువతీ యువకులు ఎవ్వరూ నిరుద్యోగులుగా మిగలకూడదు అని, నిరుద్యోగ భృతి ఇచ్చే అవసరం కూడా ఆయనకు వచ్చి ఉండకూడదు అని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యల ను గొప్పలు అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. పాపం, ఇలా గొప్పలు చెప్పుకుంటూ రిటైర్మెంట్ రోజుల్ని వెళ్లదీస్తున్నాడు అని ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి తీరు పై నెటిజన్లు స్పందిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. బాబు గారి పాలన ఎలా ఉన్నా, మీరు కూడా అదే తరహాలో ప్రజలను సోమరిలా చేసే పథకాలు కాకుండా, ప్రజలకు ఉపాధి కలిగించే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు. 18 నెలలుగా ఉద్యోగం ఇచ్చే ఒక్క కంపనీ కూడా రాలేదు అని అంటున్నారు. మరి కొందరు మాత్రం పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయం లో విమర్శలు చేస్తున్నారు.