అవినీతి డబ్బును వైట్ మనీ గా మార్చుకోడానికే హెరిటేజ్ పెట్టాడా?

Thursday, October 29th, 2020, 02:07:50 PM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికారం చేపట్టిన అనంతరం నుండి వైసీపీ నేతలు ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ పై, నేతల పై వరుస విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు తీరును ఎండగడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయాక ఏపీ కి తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన సంగతి తెలిసిందే. అయితే గతంలో చంద్రబాబు నాయుడు అధికారం లో ఉండగా, హెరిటేజ్ లాభాల్లో ఉందని, అధికారం కోల్పోయాక నష్టాలు అంటూ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఏమిటో ఈ హెరిటేజ్ కిటుకు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అవినీతి డబ్బును వైట్ మనీ గా మార్చుకోడానికి హెరిటేజ్ పెట్టాడా అంటూ సూటిగా ప్రశ్నించారు. తన స్వార్థం కోసం పాడి రైతుల ఆద్వర్యం లో నడిచే కో ఆపరేటివ్ డైరీ లను సర్వ నాశనం చేశాడు, రైతులను భ్రష్టు పట్టించాడు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.