పార్టీలో అన్ని చోట్లా కులం కంపేనా బాబూ? – ఎంపీ విజయసాయి రెడ్డి

Thursday, June 10th, 2021, 02:20:05 PM IST


తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే మనుషుల్ని కులం దృష్టితో మాత్రమే చూసే కుళ్ళు మనిషి చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఎవరైనా పట్టుబడ్డా కులం అంట గడతాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పోలీసులను వర్గం పేరుతో విభజిస్తూ గవర్నర్ కి లేఖ రాసే సాహసం చేశాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే కులం ఆధారం గా కేసులు, ట్రాఫిక్ చలానాలు రాయాలా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక పార్టీలో అన్ని చోట్ల కులం కంపే నా బాబూ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతూ టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా గవర్నర్ కి చంద్రబాబు నాయుడు లేఖ రాయడం తో విజయసాయి రెడ్డి ఈ తీరు గా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.