ఆ భూముల్లో వేల కోట్ల నొట్ల కట్టలు పండకపోతే చంద్రబాబు కి కోపం రాదా?

Sunday, October 25th, 2020, 04:06:10 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబు కి వందల కోట్ల రూపాయల పాలు ఇచ్చింది అని వ్యాఖ్యానించారు. అయితే 2014 లో ఆ గేదె కు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కొట్లుగా నోట్ల కట్టలు పండకపోతే మరి చంద్రబాబు కి కోపం రాదా అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

కొందరు వైసీపీ తీరును తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఒక్క రాజధాని నిర్మాణం పూర్తి చేయలేని వారు మూడు రాజధానులను ఎలా పూర్తి చేస్తారు అంటూ వైసీపీ తీరు పై సెటైర్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసే సందర్భం లో షూస్ వేసుకున్న ఫొటోలను పోస్ట్ చేస్తూ విమర్శిస్తున్నారు. అయితే అమరావతి రాజధాని విషయం ను పరోక్షంగా నే విజయసాయి రెడ్డి టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చంసనీయం గా మారాయి.