నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది బాబు గారికి కదా!

Wednesday, October 14th, 2020, 03:20:43 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలం పాటలో కొత్త థియరీ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది బాబు గారికి కదా అంటూ విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు. ఎవరికో ఇవ్వడం ఎంటి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ల కొనుగోలు కు బాబు ఎప్పుడో కొత్త వేలం విధానాన్ని కనిపెట్టిన సంగతి నోబెల్ కమిటీ దృష్టికి వెళ్ళలేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికైనా ఆయన పేరు చేర్చి న్యాయం చేయాలి అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ పాలన విధానం పై ఒక్కొక్కరూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అంతేకాక రివర్స్ వేలం అంటూ సెటైర్స్ వేస్తున్నారు. కొందరు మాత్రం టీడీపీ నేతల పై సైతం విమర్శలు చేస్తున్నారు.