వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగ్ కి బాగా తెలిసిన విద్య – వైసీపీ ఎంపీ

Monday, May 17th, 2021, 12:26:57 PM IST

Vijaya_sai
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ కి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ విషయం లో ప్రతి పక్ష పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఎల్లో మీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగ్ కి బాగా తెలిసిన విద్య అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కడప పేరు తెప్పించి అక్కడి ప్రజలను అవమనించాలని కుట్రలు పన్నుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు తెలుగు దేశం పార్టీ కి చెందిన అభిమానులు ఎంపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వరుస విమర్శలు చేస్తున్నారు.