వాక్సిన్లు తెప్పించగలిగే పరపతి ఉంటే ప్రయత్నించు – ఎంపీ విజయసాయి రెడ్డి

Thursday, May 13th, 2021, 11:42:23 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అని టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబు నాయుడు తరచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాక్సిన్ ల విషయం లో సైతం అధికార పార్టీ పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. అయితే వారికి ధీటుగా సమాధానం ఇచ్చారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. ఇప్పట్లో ఎలక్షన్లు ఏవీ లేవు అని వ్యాఖ్యానించారు. నువ్వు ఉండేది రాష్ట్రం బయట అని, ఇక్కడ నీ పార్టీ అవసాన దశలో ఉందని, ఇలాంటి సమయం లో రాజకీయాలు ఎందుకు బాబు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను భయాందోళనలకి గురి చేసే శాడిస్ట్ ఆనందం పొందడానికి ఇన్ని వేశాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే వాక్సిన్లు తెప్పించగలిగే పరపతి ఉంటే ప్రయత్నించు అంటూ చెప్పుకొచ్చారు.అనవసర రచ్చ ఎందుకు అంటూ మండిపడ్డారు. మరొక ట్వీట్ లో రుయా ఘటన ను భూతద్దంలో చూపిస్తున్న పచ్చ బ్యాచ్ రమేష్ హాస్పిటల్ లో అగ్నికి ఆహుతి అయిన అభాగ్యుల గురించి, గోదావరి పుష్కరాల్లో బాబు అదృశ్య పాదాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన 30 మంది గురించి ఎందుకు మాట్లాడలేదు అని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు అంటూ పేర్కొన్నారు. జవాబు చెప్పడానికి ఏదైనా పాయింట్ ఉందా మీ దగ్గర అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి దీని పై తెలుగు దేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.