14 ఏళ్లు సీఎంగా ఉండి పొడిచింది ఏముంది? – ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, May 9th, 2021, 12:01:16 PM IST

Vijaya_sai
తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వారం రోజుల సీఎం కుర్చీ పగటి కల ఎంటి చంద్రబాబు అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేపథ్యం లో చంద్రబాబు నాయుడు వారం రోజులు సీఎం గా అంటూ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే జనం నవ్వుకుంటారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు అంటూ చంద్రబాబు నాయుడు పై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

14 ఏళ్లు సీఎం గా ఉండి పొడిచింది ఏముంది అంటూ ఎద్దేవా చేసారు. ఏ స్కీమ్ వల్ల నైనా ప్రజల జీవన ప్రమాణాలుపెరిగాయి అని గుండె మీద చెయ్యి వేసి చెప్పగలవా అంటూ సూటిగా ప్రశ్నించారు.ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బోట్లు పెట్టీ ఇంటికి పంపించింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీబీఐ కేసు వ్యవహారం ను బయటికి లాగుతూ వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరొక పక్క చంద్రబాబు నాయుడు పై, టీడీపీ నేతల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.