చంద్రబాబు పై ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Friday, April 23rd, 2021, 04:32:07 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి. పరిషత్ ఎన్నికల బహిష్కరణ కి చూపిన కుంటి సాకులనే చంద్రబాబు తిరుపతి ఎన్నికకు అంటగడుతున్నాడు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఎలక్షన్ల ను ఆయన బహిష్కరించినా, ప్రజలు చిత్తుగా ఓడించినా పోయేది ఆయనే అంటూ చెప్పుకొచ్చారు. అదే జరుగుతుంది అంటూ విమర్శించారు. అయితే మనసు రాయి చేసుకొని జెండా పీకేస్తాడో, చీలికలు పీలికలు అయినా పోరాటం కొనసాగిస్తాడో చూడాలి అంటూ చెప్పుకొచ్చారు.

ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక చేసిన అభివృద్ది కార్యక్రమాల గురించి మీరు ట్వీట్ చేయండి అని వ్యాఖ్యానించారు. అయితే తరచూ తెలుగు దేశం పార్టీ నేతల పై, అధినేత చంద్రబాబు పై చేస్తున్న వరుస విమర్శల పట్ల టీడీపీ అభిమానులు విజయసాయి రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.