చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి

Tuesday, September 8th, 2020, 02:05:00 AM IST

Ycp-mp-Vijayasai-reddy
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి లాగా, సీఎం జగన్ గారి లాగా చంద్రబాబు ను గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటీ లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెబుతాడు అని, డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చొచ్చనే భ్రాంతి లో మునిగి తేలుతూ ఉంటాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీని కోసం ఒక నయా పెట్టుబడి దారి ముఠాను తయారు చేశాడు అని ఆరోపణలు చేశారు.

ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధం అయినందుకు గల కారణం పట్ల నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. కొందరు చంద్రబాబు పై విమర్శలు చేస్తుండగా, మరి కొందరు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన విధానం పై విమర్శలు చేస్తున్నారు.