తన రాజకీయ పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు – ఎంపీ విజయసాయి రెడ్డి

Friday, April 16th, 2021, 10:52:07 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుల పిచ్చితో అడ్డమైన అరాచకాలు చేసి చంద్రబాబు తన రాజకీయ పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. మతం పేరుతో విభజన తీసుకు రావాలని ఆరాటపడుతున్న వాళ్ళ గతి అంతే అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పొలింగ్ కి రెండు రోజుల ముందు దాకా గురుమూర్తి మతం ఏమిటో తెలియదా మీకు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక మీకంటే ఆయన నిఖార్సైన హిందువు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతూ వరుస ప్రశ్నలు సంధించారు. అయితే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నిక కి సంబందించి అటు టీడీపీ, బీజేపీ – జనసేన లు మరియు ఇటు అధికార పార్టీ వైసీపీ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే వైసీపీ కి టీడీపీ మధ్యలో మాత్రం తారా స్థాయి లో మాటల యుద్దాలు నడుస్తున్నాయి.