సొంత జిల్లాలోనే వింత పరిస్థితి చంద్రబాబుకు – ఎంపీ విజయసాయి రెడ్డి

Friday, March 26th, 2021, 12:56:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. అయితే ఇంకా ఎంపీటీసీ మరియు zptc ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలను నిర్వహించడానికి సమయం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. అయితే ఈ అంశాల పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రస్తావిస్తూ తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కట్టప్పను మించిన పెద్ద బానిసతో MPTC, ZPTC ఎలక్షన్లు వాయిదా వేయించాడు అని ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక ఫోబియా తో గజ గజ వణుకుతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. డిపాజిట్లు కూడా రావని తెలుసు అంటూ విమర్శించారు. ప్రచారానికి వెళ్తే మొహం చూసే వారుండరు అని ఎద్దేవా చేసారు. సొంత జిల్లాలోనే వింత పరిస్థితి చంద్రబాబుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజక వర్గం అయిన కుప్పం లో టీడీపీ బలపరిచిన అభ్యర్ధులు దారుణ ఓటమి చవి చూశారు. దాదాపు అన్ని స్థానాలు వైసీపీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు పై విజయసాయి రెడ్డి చేసిన ఈ ఘాటు విమర్శల పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.