ఆస్కార్ రేంజ్ నటుడికి జాతీయ అవార్డ్ కూడా రాకపోవడమా…చంద్రబాబు పై ఎంపీ సెటైర్స్!

Wednesday, March 24th, 2021, 03:50:23 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తరచూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే మరొకసారి ఎంపీ విజయసాయి రెడ్డి వీరిద్దరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మహానటుడు చంద్రబాబు పేరు లేకపోవడం నిజంగా బాధాకరం అని సెటైర్స్ వేశారు. ఈ ఆస్కార్ రేంజ్ నటుడికి జాతీయ అవార్డ్ కూడా రాకపోవడమా అంటూ ఎద్దేవా చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అపూర్వంగా నటించాడే అంటూ విమర్శించారు. చిట్టినాయుడు కైనా సహాయ నటుడు అవార్డు దక్కాల్సింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ల ప్రచారం పట్ల వైసీపీ నేతలు వరుస విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి ఈ తతంగాన్ని అంతా కూడా సెటైర్స్ వేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రతి పక్ష హోదాలో ఉండగా చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తూ దీనికి కూడా ఇవ్వాల్సింది అంటూ విమర్శలు చేస్తున్నారు.