CBN పేరును ఎప్పుడో స్టేBNగా మార్చారు – ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, March 21st, 2021, 06:31:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. CBN పేరును ఎప్పుడో స్టే బీఎన్ గా మార్చారు నెటిజన్లు అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ తప్పూ చేయకపోతే కేసులు ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా ఎంతకాలం స్టే లతో కాలం వెల్లదిస్తాడో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మాత్రం ఈయన చేసిన అక్రమాలకు స్టే లు ఇవ్వకుండా చిత్తుగా ఓడించి తీర్పు చెప్పారు అని, శిక్ష అమలు చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి తీరును ఎండగడుతూ తన పై ఉన్న కేసుల విశయం గురించి ప్రస్తావిస్తూ, ఏ 2 అంటూ సంబోధిస్తూ విరుచుకు పడుతున్నారు.