దేవతకు, దెయ్యానికి తేడా తెలియదా బాబూ – వైసీపీ ఎంపీ

Thursday, February 25th, 2021, 02:25:32 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పతనం తర్వాత చంద్రబాబు కి మైండ్ బ్లాంక్ అయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాల ధ్వంసం ప్లాన్ రివర్స్ అవ్వడం తో ఇప్పుడు స్వామీజీ లని ఆడిపోసుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. కళ్ళు బైర్లు కమ్మి, లోక కళ్యాణం కోసం చేసే రాజశ్యామల యాగం కూడా అతనికి క్షుద్ర పూజలా కనిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవతకు, దెయ్యానికి తేడా తెలియదా బాబూ అంటూ విమర్శలు గుప్పించారు.

అయితే వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు టీడీపీ మద్దతు దారులు వైసీపీ ను విమర్శిస్తూ విజయసాయి రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.