ఇప్పుడూ అదే ఏడుపు రిపీట్ అయింది – విజయసాయి రెడ్డి

Wednesday, February 24th, 2021, 01:45:24 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరోమారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి 23 సీట్లకు పరిమితం అయిన తర్వాత చంద్రబాబు ఇలాగే గుడ్డలు చించుకొని మాట్లాడాడు అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పుడూ అదే ఏడుపు రిపీట్ అయింది అంటూ వ్యాఖ్యానించారు. ఎప్పటిలాగే అధికారులను, పోలీసులను బెదిరించాడు అంటూ ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించి తప్పు చేశారు అంటూ తేల్చాడు అంటూ చెప్పుకొచ్చారు. మతి పూర్తిగా భ్రమించింది అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

అయితే మరొక ట్వీట్ లో పోలీస్ అధికారులను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు చూస్తుంటే తక్షణం తక్షణం ఎర్రగడ్డ లో తేల్చాల్సిన పరిస్తితి కనిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరి వివరాలు రాసుకున్నాడంట అని వ్యాఖ్యానించారు. ఆధారాలు కూడా ఉన్నాయంట అని అన్నారు. జమిలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిన వెంటనే ఆయన సీఎం అయి తన పవరేంటో చూపిస్తాడంట అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు పై వరుస సెటైర్స్ వేశారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు.