సొల్లు మాటలు చెబుతూనే ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశాడు చంద్రబాబు – విజయసాయి రెడ్డి

Tuesday, February 23rd, 2021, 01:20:42 PM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరిగిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరియు ఫలితాల విషయం లో వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి అని ఎలక్షన్ కమీషన్, పోలీస్ శాఖలు వెల్లడించాయి అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ గారి 20 నెలల సంక్షేమ పాలన కి కృతజ్ఞత గా దక్కిన అఖండ విజయం అంటూ విజయసాయి రెడ్డి కొనియాడారు. టీడీపీ అడ్రస్సు గల్లంతయి గ్రామాలన్నీ వన్ సైడ్ గా మారడం వలన అవాంఛనీయ ఘటనలకి ఆస్కారం లేకుండా పోయింది అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.

అయితే ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగా రాకపోతే ఓటమిని సమీక్షించుకుంటాం అని అంటారు ఎవరైనా అంటూ చెప్పుకొచ్చారు. నాలుగో విడత 41.7 శాతం ఓట్లు పడ్డాయి అని సొల్లు మాటలు చెబుతూనే ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశాడు చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతను మారడు అని, తను భ్రమల్లో జీవిస్తూ అందరినీ అదే భ్రాంతి లో ఉంచాలని చూస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ పరిస్తితి ను అద్దంలో చూపించేశారు ప్రజలు అని వ్యాఖ్యానించారు.మున్సిపల్ ఎన్నికల్లో చేసేది లేక రౌడీయిజం, ప్రలోభాలకి తెగబడుతున్నారు టీడీపీ నేతలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే విజయనగరం లో బహిరంగం గానే కోడ్ ఉల్లంఘిస్తుంటే sec ఏం చేస్తున్నట్లు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సూటిగా ప్రశ్నించారు. గుడ్డిగుర్రం పళ్ళు తోముతున్నాడా లేక చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.