మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలమ్మను కొట్టాడు – విజయసాయి రెడ్డి

Monday, February 22nd, 2021, 12:06:56 AM IST

Ycp-mp-Vijayasai-reddy
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో ప్రధాని నరేంద్ర మోడీ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్స్ వేశారు. మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలమ్మ ను కొట్టాడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక కాపీ పేస్ట్ లెటర్ రాయడానికే పక్షం రోజులు అంటూ ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణ వద్దని మాత్రం లేఖ లో చెప్పలేదు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పైగా లాభదాయకం గా నడపాలి అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తప్పనిసరి అని ఆ లేఖ సందేశం అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. చిత్తశుద్ది లేని శివ పూజలేల చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. మీ పాదయాత్ర కన్నా, ఈ లేఖ కి ఎక్కువ దమ్ముంది అంటూ చెప్పుకొచ్చారు.