విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిలదీయాల్సింది ఎవర్ని బాబూ? – వైసీపీ ఎంపీ

Friday, February 19th, 2021, 07:34:41 AM IST

Vijaya_sai

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరోమారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. 54 ప్రభుత్వ కంపనీ లను అమ్మిన తుక్కు బాబు విశాఖ కోసం పోరాడతాడంట అంటూ ఎద్దేవా చేశారు. విశాఖ ను పాలనా రాజధాని చేస్తామనగానే విషం చిమ్మాడు అని వ్యాఖ్యానించారు. సునామీలు, భూకంపాలు వస్తాయి అంటూ పచ్చ కుల మీడియా లో విషపు రాతలు రాయించాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిలదీయాల్సింది ఎవర్ని బాబూ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే వైసీపీ పాలనా విధానం పట్ల నెటిజన్లు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ విషయం లో వైసీపీ నిర్ణయం పై వరుస విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మద్దతు ఇస్తూ బాబు పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వైజాగ్ లో చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు వరుస విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ కి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలి అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు.