తట్టాబుట్టా సర్దుకొని ఇంకో నియోజకవర్గం ను చూసుకొడమే బాబుకి మిగిలింది – వైసీపీ ఎంపీ

Thursday, February 18th, 2021, 02:16:09 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ఘటు విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వార్నింగ్ ను లెక్క చేయకుండా హైదరాబాద్ లో కూర్చొని సంక్షేమ ప్రభుత్వం పై దుర్మార్గపు కుట్రలు చేసినందుకు పంచాయతీ తీర్పు లో కుప్పం ప్రజలు కన్నెర్ర జేశారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక తట్టాబుట్టా సర్దుకొని ఇంకో నియోజకవర్గం ను చూస్కొడమే చంద్రబాబు కి మిగిలింది అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం, వ్యవహరిస్తున్న తీరు పట్ల నెటిజన్లు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం లో, పింక్ డైమండ్ విషయం లో వైసీపీ తీరును ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం తెలుగు దేశం పార్టీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం పాలు అవ్వడం తో వైసీపీ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు.