చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు – విజయసాయి రెడ్డి

Thursday, February 11th, 2021, 01:05:37 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వి ఊసరవెల్లి రాజకీయాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ విమర్శించారు. అయితే బాబు కి విశాఖ స్టీల్స్ తెలీదు కానీ, సుజనా స్టీల్స్ బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చారు.బ్యాంకులను ముంచిన వ్యక్తి సుజనా చౌదరి అను సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతున్నా బాబు పట్టించుకోడు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు పై వరుస విమర్శలు చేసే విజయసాయి రెడ్డి మరోమారు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాక సుజనా స్టీల్స్ అంటూ సుజనా చౌదరి పై మరోసారి విమర్శలకు తెరలేపారు. అయితే టీడీపీ గత ప్రభుత్వం పట్ల వరుస విమర్శలు చేస్తూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.