తెహెల్కా పత్రిక 16 ఏళ్ల క్రితమే బయటపెట్టింది – విజయసాయి రెడ్డి

Friday, February 5th, 2021, 07:43:08 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తో అటు అధికార పార్టీ, ఇటు తెలుగు దేశం పార్టీ లు మరొకసారి తమ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు ఒకరు పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ కి చెందిన కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దేశం లోనే అత్యంత అవినీతి పరుడు అని తెహెల్క పత్రిక 16 ఏళ్ల క్రితమే బయటపెట్టింది అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే 20 కేసుల్లో స్టే లు తెచ్చుకొని కూడా తాను నిప్పు అంటూ బకాయిస్తాడు అంటూ విమర్శించారు. కనకమేడల లాంటి వందిమాగదులు మరిచిపోయినా ప్రజలు మరువరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కి మద్దతు ఇస్తూ వైసీపీ తీరు ను ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.