నన్ను కూడా చంపండి అంటూ వీధి నాటకం మొదలెట్టారు – విజయసాయి రెడ్డి

Thursday, February 4th, 2021, 02:20:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అచ్చెన్న ది తప్పులేదని అంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అయితే తనను కూడా చంపండి అంటూ చేసిన వ్యాఖ్యల కి వైసిపి కి చెందిన కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్ను కూడా చంపండి అంటూ వీధి నాటకం మొదలెట్టారు చంద్రబాబు అంటూ విమర్శించారు. రాజకీయం గా ఎప్పుడో చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.మొన్న ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయింది అని, అయినా ఏదో విధంగా ప్రజల సానుభూతి తో లబ్ది పొందాలని లేచి బుసలు కొడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే చేపల కోసం కొంగలా ఓట్ల కోసం చంద్రబాబు కొంగ జపం అంటూ మరొక ట్వీట్ లో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దేవాదాయ నిధులను పక్కదోవ పట్టించాడు అని, ప్రైవేట్ వ్యక్తులకు గ్రాంట్లు గా ఇచ్చాడు అంటూ ఆరోపించారు. అయితే ఆలయాల పై దండయాత్ర చేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు కూల్చేసిన దేవాలయాలను ఇప్పుడు పునర్నిర్మిస్తుంటే నానా రచ్చ చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు టీడీపీ పై వరుస విమర్శలు చేస్తుండగా, మరికొందరు మాత్రం వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.