గుళ్ళను కూల్చినోడికి ఇంతకుమించిన అలోచనలు ఎలా వస్తాయి?

Wednesday, February 3rd, 2021, 01:18:34 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతి ఎన్నికలు పెట్టాల్సిందే అని రంకెలేసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యర్దులు దొరక్క కళ్ళు తెలేస్తున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ పరాభవం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు తన పార్టీ నాయకుల మీద తానే దాడులు చేయించే కుట్రలు మొదలు పెట్టాడు అంటూ చెప్పుకొచ్చారు. గుళ్ల ను కూల్చినొడికి ఇంతకు మించి ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే మరొక ట్వీట్ లో అచ్చెన్న కాబోయే హోం మినిస్టర్ అట అంటూ విమర్శలు గుప్పించారు.క్రిమినల్ కేసులోఅరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులని బెదిరించాడనికి బిస్కెట్ వేశాడు అంటూ సెటైర్స్ వేశారు. చంద్రబాబు చెవిలో చెప్పి ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు. బహిరంగ పరిస్తే ఎలా అచ్చెన్నా అంటూ విమర్శించారు. మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా తాము ఏ శాఖల మంత్రులో చెబుతారట అంటూ సెటైర్స్ వేశారు. పిచ్చి అందరికీ అంటించాడు అంటూ విజయసాయి రెడ్డి అన్నారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అటు టీడీపీ పై ఘాటు విమర్శలతో రెచ్చిపోతున్నారు. మరి కొందరు మాత్రం వైసీపీ పై విమర్శలు చేస్తున్నారు.