మేం సేఫ్ గా ఉంటే చాలనే శాడిజం కనిపిస్తోంది

Friday, January 29th, 2021, 10:03:21 AM IST

Ycp-mp-Vijayasai-reddy

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరోమారు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లోకి పంపించగా మిగిలిన ఎంపీ లతో మాట్లాడేందుకు చంద్రబాబు బిగించుకున్న అద్దాల తెర చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటూ విజయసాయి రెడ్డి ప్రజలకు సూచించారు. ఉద్యోగులు ఓటర్లు కరోనా తో పోయినా ఫర్వాలేదు అని, మేం సేఫ్ గా ఉంటే చాలనే శాడిజం కనిపిస్తోంది అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్ల కుట్ర పూరిత మనస్తత్వం ప్రజలకు క్లియర్ గా అర్ధం అవుతోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఎంపీ లతో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోను సైతం విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం పార్టీ కి చెందిన ఇతర నేతలు పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో చేస్తున్న వ్యాఖ్యల పట్ల, వీరు అద్దాల తెరల తో రక్షణ కల్పించుకొని మాట్లాడుతున్న తీరు పట్ల వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజల, ఉద్యోగుల ఆరోగ్యం కంటే ఎన్నికలే ముఖ్యం అనే రీతి లో ప్రవర్తిస్తున్నారు అన్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు.