జనం ఉమ్మేస్తారాన్న భయం కూడా లేకుండా…వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Friday, January 22nd, 2021, 01:42:15 PM IST

Ycp-mp-Vijayasai-reddy

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతి, న్యాయం, సిగ్గు, లజ్జ లను గాలికి వదిలిన వ్యక్తి ధర్మ పరిక్రమ యాత్ర అంటూ పిలుపునివ్వడం దిగజారుడుకి పరాకాష్ట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ఉమ్మేస్తారన్న భయం కూడా లేకుండా దబాయింపు లకు దిగజారుతున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. గుళ్లను కూల్చి, దేవతా మూర్తులను అపవిత్రం చేస్తూ ధర్మం గురించి సుద్దులు చెప్పడం ఇంకెవరి వల్లా కాదు బాబు అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. సిగ్గు, లజ్జ ల గురించి మీరే మాట్లాడాలి అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. 16 నెలలు చిప్పకూడు తిని ఏ 2 పలు కేసులో ముద్దాయి గా ఉన్న మీరు నిర్లజ్జగా ఇలా మాట్లాడటం విడ్డూరం అంటూ విమర్శించారు. అయితే టీడీపీ కి మద్దతు గా పలువురు మాట్లాడుతూ వైసీపీ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.