వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసినవారే…వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Wednesday, January 20th, 2021, 04:11:06 PM IST

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసిన వారేగజ మాలలు వేసి శోకాలు నటిస్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా ధనాన్ని డేకాయిట్ల లాగాl లూటీ చేసినవారే దొంగ దొంగ అని అరుస్తారు అంటూ విమర్శించారు. గుళ్ళు కూల్చిన వారే అపచారం అపచారం అంటూ గొంతు చించుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాబు మార్ బ్యాంక్ రప్ట్ పాలిటిక్స్ ఇలానే ఉంటాయి అంటూ ఆరోపించారు.

అయితే వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మీరు, జగన్ గుర్తోస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు చేస్తున్న వరుస విమర్శలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.