అలా చేయడానికిది బ్రిటిష్ వారి కాలం కాదు బాబు

Friday, January 15th, 2021, 07:31:33 AM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ లు, దళితులు ఐక్యం గా ఉంటే చంద్రబాబు కి కడుపు మంట అంటూ వ్యాఖ్యానించారు. అందుకే వాళ్ళల్లో వారికే చిచ్చు పెడుతున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అది పలాస అయినా, వెలగపూడి అయిన చంద్రబాబు విభజించి పాలించు సిద్దాంతాలు బ్రిటీష్ వారిని మించి పోతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిగజారుడు రాజకీయాలు చేయడానికిది బ్రిటిష్ వారి కాలం కాదు బాబూ అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. అయితే మరొక ట్వీట్ లో ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న వైసీపీ పాలనా విధానం పై, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బాబు గారు ముఖ్యమంత్రి గా లేకపోవడం టీడీపీ తెలుగు దళారీ పార్టీ, బ్రోకర్లకు లోటే అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆర్భాటాలు లేకుండా పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు వెల్లువెత్తుతున్నాయి అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాక కరోనా పై కరాటే లాంటి స్కీమ్ లు పెట్టి కోట్లు కొట్టేయకుండానే కరోనా కంట్రోల్ అవుతుంది అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. దళారులు లేకుండానే సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి అని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ పాలనా విధానం పై వరుస విమర్శలు చేస్తున్నారు.