రైతు బాగుపడితే మీకు అంత కడుపుమంట ఎందుకు?

Thursday, January 14th, 2021, 01:49:52 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమూల్ రాకతో వరి పండించే రైతులు కూడా అదనపు ఆదాయం తో ఆనందం గా ఉన్నారు అని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మరి రాష్ట్రం ఇచ్చిన జీ వో లను భోగి మంటల్లో వేయమంటారు ఎంటి చంద్రబాబు గారూ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. హెరిటేజ్ కంపనీ ఆదాయం తగ్గినా లక్షలాది రైతులకు లాభం జరిగింది గా అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. రైతు బాగు పడితే మీకు ఎందుకు అంత కడుపు మంట అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ పాలన విధానం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి కొందరు మాత్రం చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమూల్ వలన రైతు లాభం పొందుతున్నాడు అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు సైతం కౌంటర్ ఇస్తున్నారు.