బాబేమో ఏ గుడిని కూల్చాలా అని రాత్రి టార్చిలైట్ వేసి వెతుకుతున్నాడు

Thursday, January 7th, 2021, 09:32:28 AM IST

Ycp-mp-Vijayasai-reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తరచూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేస్తూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి వ్యాఖ్యానిస్తుంటారు. అయితే మరొక సారి అదే తరహాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అర్హతలు ఉండి సంక్షేమ పథకాలు అందని లబ్దిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గాలిస్తుంట్, బాబేమో ఏ గుడిని కుల్చాలా అని రాత్రి టార్చ్ లైట్ వేసి వెరుకుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఉనికి ప్రశ్నార్థకం అయినప్పుడల్లా ఇలా నీచ స్థాయికి దిగజరుతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే యెల్లో మీడియా దాస్తూ వచ్చిన క్రూరత్వ కోణం ఇప్పుడు నగ్నంగా బయట పడింది అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు.

ప్రభుత్వం పథకాలను ఉద్దేశిస్తూ పలువురు వైసీపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేస్తున్నారు. చివరన రెడ్డి ఉంటే దేనికైనా అర్హుడు కదా, గాలించాల్సిన అవసరం ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు. కొందరు మాత్రం టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు.