ఒంటరిగా మిగిలిపోయాడు అని తొందర్లోనే తెలుస్తుంది

Wednesday, January 6th, 2021, 12:15:58 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందుకు సాగడం ప్రకృతి నియమం అని, మధ్య యుగాల నాటి ఉన్మాద మనస్తత్వం తో చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనం లోకి దూసుకు వెళ్తున్నాడు అంటూ విమర్శించారు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనక పడిపోయాడు అని, ఒంటరిగా మిగిలిపోయాడు అని తొందర్లోనే తెలుస్తుంది అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరొక పోస్ట్ లో నారా లోకేష్ కోసం చంద్రబాబు ఎం చేయడానికి అయినా వెనకడుగు వేయడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అసమర్థుడు అయిన పుత్ర రత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంస రచనకైనా సిద్ధమేనని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు అని అన్నారు. 14 ఏళ్లు సీఎం గా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇక పై తాను కొందరికే ప్రాతినిధ్యం వహిస్తాను అని ప్రకటించాడు అంటూ ఎద్దేవా చేశారు.అయితే మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసెయ్ బాబు అంటూ వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు వైసీపీ కి మద్దతు ఇస్తూ కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు వైసీపీ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.