రామతీర్థం రామునితో రాజకీయాలు చేస్తావా?

Monday, January 4th, 2021, 02:12:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రామతీర్థం విగ్రహం ధ్వంసం అంశం పై అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలు ఒకరు పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మరొకసారి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శ్రీ రాముని విగ్రహాన్ని మీరు మీ గ్యాంగ్ ధ్వంసం చేసి ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలు ఎంటి బాబూ అంటూ విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రామతీర్థం రామునితో రాజకీయాలు చేస్తావా అంటూ సూటిగా వరుస ప్రశ్నలు వేశారు. ఎన్ని చేసినా నువ్వు రావణాసురుడివే అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం చీదరించుకోవడం తో ఇప్పుడు మతాల మధ్య మారణ హోమం సృష్టించాలని అనుకుంటున్నావా అంటూ ద్వజమెత్తారు.

అయితే మరొక ట్వీట్ లో చంద్రబాబు విధ్వంసకర రాజకీయాలు చేస్తుంటే మన సీఎం జగన్ గారు సంక్షేమ సేద్యం చేస్తున్నారు అంటూ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు విజయసాయి రెడ్డి. వ్యవసాయ రంగ మౌలిక వసతుల కల్పనకు 10,300 కోట్లతో రసాయనాలు తగ్గించేందుకు ప్రతి గ్రామంలో మూడు బయో ఫెర్టిలైజర్ ఉత్పత్తి కేంద్రాలు, ప్రతి నియోజక వర్గం లోనూ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.